శివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన ఎన్నారై గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి
మర్రిగూడ, జూలై 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంలోని గ్రామంలో నిశ్చరాల గుండ్ల వద్ద నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనులను బుధవారం ఎన్నారై మర్రిగూడ వాసి గుమ్మకొండ మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఆయనతో పాటు గుమ్మకొండ రఘునందన్ రెడ్డి సహకారంతో ఈ ఆలయ నిర్మాణం జరుగుతోంది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, “పుట్టిన ఊరికి ఏదో చేయాలనే తపనతో ఈ శివాలయాన్ని నిర్మిస్తున్నాను. ఆలయానికి దాదాపు కోటిన్నర రూపాయల వ్యయం అవుతుంది” అని తెలిపారు. గ్రామ ప్రజలు ఈ శివాలయ నిర్మాణాన్ని హర్షం...