Thursday, July 16, 2026
Homeతెలంగాణర్యాకల్ దేవ్‌పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ర్యాకల్ దేవ్‌పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఎలిగేడు, జూలై 15 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టబడ్డాయి.గ్రామ సర్పంచ్ మద్దెల రమాదేవి సంపత్, ఉప సర్పంచ్ బొడుగే శివకృష్ణ గౌడ్ కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే మా లక్ష్యం. ఎన్నో రోజులుగా ఇరుకు రహదారి సమస్యతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇప్పుడు కొత్త సీసీ రోడ్డు ద్వారా సౌకర్యం కలుగుతుంది” అని పేర్కొన్నారు.గ్రామ ప్రజలు ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో నిధులు మంజూరైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు జి. నవీన్, గుడికందుల చంద్రకళ నరేష్, ఫీల్డ్ అసిస్టెంట్ సాగర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!