వంగూరు, జూలై 15(చైతన్యగళం): వంగూరు మండల కేంద్రంలో ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి అర్హులైన ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని గుర్తుచేస్తూ, ప్రతి అర్హుడైన ఓటరు తన పేరు జాబితాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. BLOలు గ్రామాల్లో తిరుగుతూ ఎన్యుమరేషన్ ఫారాల నమోదు ప్రక్రియను వేగవంతం చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
