ర్యాకల్ దేవ్‌పల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
ఎలిగేడు, జూలై 15 (చైతన్యగళం): ఎలిగేడు మండలంలోని ర్యాకల్ దేవ్‌పల్లి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా, ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో రూ.10 లక్షల వ్యయంతో ఈ పనులు చేపట్టబడ్డాయి.గ్రామ సర్పంచ్ మద్దెల రమాదేవి సంపత్, ఉప సర్పంచ్ బొడుగే శివకృష్ణ గౌడ్ కలిసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించడమే మా...