Wednesday, July 15, 2026
Homeతెలంగాణమండలంలో ఓటర్ ఎన్యుమరేషన్ ను పరిశీలించిన మండల బూత్ ఇంచార్జ్ సురేష్

మండలంలో ఓటర్ ఎన్యుమరేషన్ ను పరిశీలించిన మండల బూత్ ఇంచార్జ్ సురేష్

📰 Generate e-Paper Clip

  • ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలు నింపివ్వడం త్వరితగతిన పూర్తయ్యేలాచూడాలి
  • ఓటు మన ప్రాథమిక హక్కు నమోదు చేసుకోవడం మన బాధ్యత

 

దేవరకొండ జూలై 14(చైతన్యగళం): కొండమల్లేపల్లిమండల పరిధిలోని పలు గ్రామాల్లో ఓటర్ ఎన్యుమరేషన్ (ఓటరు నమోదు) ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ నమోదు ప్రక్రియను దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ సూచన మేరకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ కొండ మల్లెపల్లి మండల పలు బూత్ ల ఇంచార్జ్ యేకుల సురేష్ వివిధ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
ఇందులో భాగంగా చెన్నమనేని గ్రామ పంచాయతీ పరిధిలోని స్థానిక పోలింగ్ బూత్‌ను ఆయన సందర్శించి, రిజిస్ట్రేషన్ పనుల పురోగతిని, పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. స్వయంగా రంగంలోకి దిగి పలు ఎన్యుమరేషన్ ఫారాలను నింపడంలో ప్రజలకు సహాయం చేస్తూ, సకాలంలో వివరాలను నమోదు చేసుకునేలా ప్రోత్సహించారు. ఓటరు నమోదులో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ బాధ్యతని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ సర్పంచ్ శ్రీపతి , ఆయనతో పాటు జీపీఓ అమర్, పంచాయతీ సెక్రెటరీ చిలుముల విజయ్, బిఎల్ఓ రేణుక, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనయ్య, బిఎల్ఏ మరియు పలువురు స్థానిక సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!