ఘనంగా తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం
గంగాధర,జూలై 14 (చైతన్యగళం): కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం ఈరోజు రామడుగు మండలం గోపాలరావుపేట్ గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ సీనియర్ నాయకులు సీపేల్లి వెంకటేష్ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గుంజపడుగు హరిప్రసాద్ హాజరై టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేన పార్టీ కవితక్క నాయకత్వంలో ప్రజలకు ఉచిత విద్య ,ఉచిత వైద్యం, రైతే రాజు నియామకాలు, సామాజిక తెలంగాణనే లక్ష్యంగా పాంచ...