డిండి ఎబివిపి ఆధ్వర్యంలో కళాశాల బంద్ విజయవంతం

దేవరకొండ, జూలై 14 (చైతన్యగళం): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిండి మండలంలో ఎబివిపి శాఖ ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతంగా జరిగింది. విద్యార్థుల స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎబివిపి నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఎబివిపి డిండి శాఖ నాయకుడు బాధమోని సాయి గౌడ్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం...