నందికొట్కూరు, జూలై 10 (చైతన్యగళం):
శ్రీశైలం నీటి ముంపు బాధితులు 98 జీవో అమలుకోసం గత 107 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు రాష్ట్ర బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – నీటి ముంపు కారణంగా ఇప్పటివరకు 32 మంది నిర్వాసితులు ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా ₹3 లక్షల 20 వేల విరాళం ప్రకటించారు.అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
98 జీవో దీక్షకు బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంఘీభావం
RELATED ARTICLES
