సంక్షేమాలకు వారధి వైఎస్సార్

నందికొట్కూరు (చైతన్యగళం): మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పదివేల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీటీసీ పుల్యాల దివ్య నాగిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త, ఇంచార్జ్ డా. దారా సుధీర్ ఆదేశాల మేరకు సర్పంచ్ పెరుమాళ్ల శేషన్న ఆధ్వర్యంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పుల్యాల దివ్య నాగిరెడ్డి మాట్లాడుతూ – వైఎస్సార్ నిరుపేదలకు, విద్యార్థులకు చేసిన సేవ తరాలు మారినా మరువలేనిదని, ఆయన పరిపాలన సంక్షేమానికి వారధిగా నిలిచిందని కొనియాడారు. ప్రజల...