Thursday, September 10, 2026
Homeతెలంగాణమేడిపల్లి–మాల్, మేడిపల్లి–ఆమనగల్ బస్సు పునఃప్రారంభం

మేడిపల్లి–మాల్, మేడిపల్లి–ఆమనగల్ బస్సు పునఃప్రారంభం

📰 Generate e-Paper Clip

యాచారం, ఆగస్టు 18 (చైతన్యగళం):

కరోనా సమయంలో కల్వకుర్తి డిపో నుంచి రద్దయిన మేడిపల్లి–మాల్, మేడిపల్లి–ఆమనగల్ బస్సు సర్వీసును మంగళవారం పునఃప్రారంభించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ఆమనగల్ నుంచి మేడిపల్లి వరకు బస్సుకు వివిధ గ్రామాల ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరికొండ సర్పంచి పాలకుర్ల మహేందర్, పల్లెచెల్కతండా కడ్తాల్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు శ్రీను నాయక్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

బస్సు సర్వీసు పునఃప్రారంభంతో ఆమనగల్, మేడిపల్లి పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, పీఆర్‌జీ ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్తతో పాటు పలువురు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!