Wednesday, July 8, 2026
Homeతెలంగాణనాలుగు దశాబ్దాల నమ్మకానికి మరో గుర్తింపు

నాలుగు దశాబ్దాల నమ్మకానికి మరో గుర్తింపు

📰 Generate e-Paper Clip

  • ప్రకాశ్ ఎలక్ట్రికల్స్‌కు వరుసగా ఐదోసారి సీఆర్‌ఐ స్టార్ పర్‌ఫార్మెన్స్ అవార్డు
  • అవార్డు అందుకున్న అధినేత నాళ్ల వీరన్నకు అభినందనలు

మహబూబాబాద్, జూలై 7(చైతన్యగళం): నాలుగు దశాబ్దాలకు పైగా రైతులకు నాణ్యమైన విద్యుత్, వ్యవసాయ పరికరాలను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించిన మహబూబాబాద్‌కు చెందిన ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ మరోసారి ప్రతిష్టాత్మక సీఆర్‌ఐ స్టార్ పర్‌ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ అధినేత నాళ్ల వీరన్న వరుసగా ఐదోసారి అందుకోవడం విశేషం.

హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సీఆర్‌ఐ పంప్స్ తెలంగాణ రాష్ట్ర డీలర్ల సమావేశంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. సీఆర్‌ఐ జోనల్ మేనేజర్ మధుసూదన్, తెలంగాణ రీజినల్ మేనేజర్లు శ్రీనివాస్, మహేందర్, రాము, సునీల్‌లు నాళ్ల వీరన్నకు అవార్డును అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ మధుసూదన్ మాట్లాడుతూ, మహబూబాబాద్ జిల్లాలో ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ నాణ్యత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందన్నారు. గత 40 ఏళ్లుగా జిల్లా కేంద్రంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు, వినియోగదారులకు ఉత్తమ నాణ్యత గల సీఆర్‌ఐ ఉత్పత్తులను అందిస్తూ సంస్థ విశేష సేవలు అందిస్తోందని ప్రశంసించారు. రైతులకు సీఆర్‌ఐ సేవలను సమర్థవంతంగా చేరవేస్తూ అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకే రాష్ట్రస్థాయి స్టార్ పర్‌ఫార్మెన్స్ అవార్డు వరుసగా ఐదోసారి దక్కిందని పేర్కొన్నారు.

అవార్డు గ్రహీత నాళ్ల వీరన్న మాట్లాడుతూ, ప్రతిష్టాత్మక సీఆర్‌ఐ సంస్థ నుంచి వరుసగా ఐదోసారి రాష్ట్రస్థాయి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా రైతులకు నాణ్యమైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు.

ఈ సందర్భంగా నాళ్ల వీరన్నకు జిల్లా ప్రముఖులు, వ్యాపారవేత్తలు, డీలర్లు, ఎలక్ట్రికల్ వ్యాపారులు, రైతులు, వినియోగదారులు, మిత్రులు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!