నాలుగు దశాబ్దాల నమ్మకానికి మరో గుర్తింపు

ప్రకాశ్ ఎలక్ట్రికల్స్‌కు వరుసగా ఐదోసారి సీఆర్‌ఐ స్టార్ పర్‌ఫార్మెన్స్ అవార్డు అవార్డు అందుకున్న అధినేత నాళ్ల వీరన్నకు అభినందనలు మహబూబాబాద్, జూలై 7(చైతన్యగళం): నాలుగు దశాబ్దాలకు పైగా రైతులకు నాణ్యమైన విద్యుత్, వ్యవసాయ పరికరాలను అందిస్తూ విశ్వాసాన్ని సంపాదించిన మహబూబాబాద్‌కు చెందిన ప్రకాశ్ ఎలక్ట్రికల్స్ మరోసారి ప్రతిష్టాత్మక సీఆర్‌ఐ స్టార్ పర్‌ఫార్మెన్స్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును సంస్థ అధినేత నాళ్ల వీరన్న వరుసగా ఐదోసారి అందుకోవడం విశేషం. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సీఆర్‌ఐ పంప్స్ తెలంగాణ రాష్ట్ర డీలర్ల సమావేశంలో ఈ...