Sunday, August 2, 2026
Homeతెలంగాణఆకుతోటపల్లిలో కోతుల బెడదకు చెక్

ఆకుతోటపల్లిలో కోతుల బెడదకు చెక్

📰 Generate e-Paper Clip

  • ప్రత్యేక బృందంతో చర్యలు చేపట్టిన సర్పంచ్ నరేందర్ రెడ్డి

ఆకుతోటపల్లి, జూలై 5 (చైతన్యగళం): ఆకుతోటపల్లి గ్రామంలో నెలకొన్న కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు సర్పంచ్ న్యాలపట్ల నరేందర్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కోతులను పట్టుకోవడంలో ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణుల బృందాన్ని ఆదివారం గ్రామానికి రప్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నరేందర్ రెడ్డి గ్రామస్తులతో పాటు కోతులను పట్టుకునే బృందంతో సమావేశమై వారికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించారు. వారం రోజుల పాటు గ్రామంలోనే ఉండి కోతులను సురక్షితంగా పట్టుకుని గ్రామ ప్రజలకు కోతుల సమస్య నుంచి పూర్తి ఉపశమనం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ చర్యపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ సర్పంచ్ నరేందర్ రెడ్డి కృషిని అభినందించారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని సర్పంచ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు విజయ్, కృష్ణ, మాజీ సర్పంచ్ రామచందర్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!