Monday, July 6, 2026
Homeతెలంగాణతెలంగాణ భూముల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలంపల్లి దుర్గేష్

తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలంపల్లి దుర్గేష్

📰 Generate e-Paper Clip

  • రైతుల భూముల పరిరక్షణ కోసం అంకితభావంతో పనిచేస్తానన్న నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి

యాచారం,జులై 05 (చైతన్యగళం) : తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సంస్థ బలోపేతం, రైతుల భూముల రక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా సంస్థలో కీలక బాధ్యతలను చేపట్టే నాయకులను నియమిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ భూముల పరిరక్షణ సమితి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆలంపల్లి దుర్గేష్ ను రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ మేరకు రాష్ట్ర చైర్మన్ పల్లపు విజయ్ నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొని ఆలంపల్లి దుర్గేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్థపై ఉన్న నమ్మకం, ప్రజా సమస్యలపై అవగాహన, రైతుల భూముల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు పేర్కొన్నారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆలంపల్లి దుర్గేష్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర చైర్మన్ పల్లపు విజయ్, రాష్ట్ర అధ్యక్షుడు గోడుకొండ్ల ప్రవీణ్‌తో పాటు సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల భూముల రక్షణ, నిర్వాసితుల సమస్యల పరిష్కారం, భూ ఆక్రమణలు, అక్రమ భూసేకరణలు, ప్రభుత్వ విధానాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల పక్షాన పోరాటం చేయడం తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణలో అనేక ప్రాంతాల్లో రైతుల భూములు పారిశ్రామిక అవసరాల పేరుతో, వివిధ ప్రాజెక్టుల పేరుతో కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతు భూమి అంటే కేవలం ఆస్తి మాత్రమే కాదు, అది వారి జీవనాధారం, కుటుంబాల భవిష్యత్తు అని అన్నారు. భూములను కాపాడేందుకు చట్టపరమైన పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టి రైతుల పక్షాన అండగా నిలుస్తామని తెలిపారు.

రంగారెడ్డి జిల్లాలో భూములకు సంబంధించిన సమస్యలను గ్రామ స్థాయి నుంచి గుర్తించి, బాధిత రైతులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, వారి సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రతి మండలంలో భూముల పరిరక్షణ సమితి కమిటీలను బలోపేతం చేసి రైతుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ఆలంపల్లి దుర్గేష్ నియామకం వల్ల సంస్థకు మరింత బలం చేకూరుతుందని, రైతు సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతుల భూముల రక్షణ, పేదల హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం తెలంగాణ భూముల పరిరక్షణ సమితి చేపట్టే కార్యక్రమాలను ప్రజలు ఆదరించాలని వారు కోరారు.

కార్యక్రమం అనంతరం నాయకులు ఆలంపల్లి దుర్గేష్ కు పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నియామకం పట్ల జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజా సంఘాల నాయకులు, సంస్థ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!