Monday, September 14, 2026
Homeతెలంగాణఎస్‌సి సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా మధారు శంకర్ నియామకం

ఎస్‌సి సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా మధారు శంకర్ నియామకం

📰 Generate e-Paper Clip

దేవరకొండ,జూలై 03(చైతన్యగళం):

ఎస్‌సి సంక్షేమ సంఘం (ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ) జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మధారు శంకర్ ని నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు సంఘం ప్రకటించింది.ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. సంఘ రాజ్యాంగం, నియమాలు, నిబంధనలకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహిస్తూ, సంఘాన్ని మరింత బలోపేతం చేయడం, షెడ్యూల్డ్ కులాల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సాధికారత కోసం అంకితభావంతో పనిచేయాలని జాతీయ అధ్యక్షులు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మధారు శంకర్ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకానికి జాతీయ అధ్యక్షులు తీగల అశోక్ కుమార్ కి, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నల్గొండ జిల్లాలో సంఘాన్ని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, ఎస్‌సి సమాజ హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!