Tuesday, July 7, 2026
Homeతెలంగాణబోడుప్పల్లో నూతన వే బ్రిడ్జి ప్రారంభం

బోడుప్పల్లో నూతన వే బ్రిడ్జి ప్రారంభం

📰 Generate e-Paper Clip

బోడుప్పల్, జూలై 3 (చైతన్యగళం): బోడుప్పల్–చిల్కనగర్ ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వీరబాద్ర వే బ్రిడ్జిను మాజీ మేయర్ తోటకూర అజయ్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తూనికల కొలతల విషయంలో పారదర్శకత ఉండాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యం. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ వెయింగ్ బ్రిడ్జి రవాణా, పారిశ్రామిక రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రాంత ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి” అని అన్నారు.సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో బోడుప్పల్ డివిజన్ అధ్యక్షుడు బొమ్మకు కళ్యాణ్, కొత్త కిషోర్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు రాసాల వెంకటేష్ యాదవ్, చీరాల నరసింహ, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, గుర్రాల వెంకటేష్ యాదవ్, తోటకూర రవీందర్ యాదవ్, వల్లపు ఐలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంస్థ యాజమాన్యం, ప్రముఖులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!