బోడుప్పల్లో నూతన వే బ్రిడ్జి ప్రారంభం
బోడుప్పల్, జూలై 3 (చైతన్యగళం): బోడుప్పల్–చిల్కనగర్ ప్రధాన రహదారి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వీరబాద్ర వే బ్రిడ్జిను మాజీ మేయర్ తోటకూర అజయ్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తూనికల కొలతల విషయంలో పారదర్శకత ఉండాలి. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత ముఖ్యం. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన ఈ వెయింగ్ బ్రిడ్జి రవాణా, పారిశ్రామిక రంగాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి సంస్థలు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రాంత ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయి”...