Tuesday, August 25, 2026
Homeతెలంగాణఅంగనవాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

అంగనవాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

📰 Generate e-Paper Clip

ఎలిగేడు, జూలై 2 (చైతన్యగళం):
ఎలిగేడు మండల కేంద్రంలోని అంగనవాడీ సెంటర్–1లో గురువారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ కప్పల ప్రవీణ్ గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందజేశారు. అనంతరం ఏఎల్ఎంఎస్సీ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “అంగనవాడీ కేంద్రాల్లో అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి. 3 నుండి 5 సంవత్సరాల పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా అంగనవాడీ కేంద్రాలకు పంపాలని తల్లిదండ్రులు గుర్తించాలి” అని సూచించారు.

కార్యక్రమంలో అంగనవాడీ టీచర్ జ్యోతి, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!