కరీంనగర్, జూలై 2 (చైతన్యగళం):
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో పి.జి. పరీక్షలు జూన్ 30 నుండి జూలై 13 వరకు జరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం అన్ని కేంద్రాలను తనిఖీ చేస్తున్నామని డా. సురేష్ కుమార్ పేర్కొన్నారు. అలాగే సి.డి.సి. డీన్ డా. జాఫర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డా. శ్రీవాణి పి.జి. పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలిస్తున్నారు.
