షాద్‌నగర్, జూలై 2 (చైతన్యగళం):
ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా బూర్గుల గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ విధానాన్ని షాద్‌నగర్ ఆర్డీఓ ఎన్.ఆర్. సరిత పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “ప్రతి అర్హత కలిగిన ఓటరికి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందించాలి. ఫారాలను తిరిగి స్వీకరించిన వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి” అని బూత్ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫరూక్‌నగర్ తహసీల్దార్ నాగయ్యతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
