Friday, September 4, 2026
Homeతెలంగాణమహబూబ్‌నగర్ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

ఆరు గ్యారంటీల అమలుపై బీఆర్‌ఎస్‌ పోరుబాట

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్‌ 420 హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి,మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌

వెల్దండ, సెప్టెంబర్ 3 (చైతన్యగళం):
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ పోరుబాట పట్టింది. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు వెల్దండ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో గురువారం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌, రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు పెన్షన్‌ పెంపు, రైతులకు నెలకు రూ.4,000 ఆర్థిక సహాయం, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన జైపాల్‌ యాదవ్‌.. రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను పల్లెపల్లెకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో వెల్దండ బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పుట్ట రామిరెడ్డి, కల్వకుర్తి మార్కెట్‌ మాజీ చైర్మన్‌ విజితరెడ్డి, వెల్దండ మాజీ సర్పంచ్‌ అరుణ ప్రభాకర్‌, మాజీ ఉపసర్పంచ్‌ జంగిలి నిరంజన్‌, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు నాగయ్య, మాజీ మండల అధ్యక్షుడు కానుగుల జోగయ్య, మాజీ ఎంపీటీసీలు లింగం, నాగుల్‌నాయక్‌, జ్యోతి నిరంజన్‌, రాములు, పోలే అశోక్‌, జంగిలి శీను, జంగిలి ప్రభుదాస్‌, జంగిలి ప్రసాద్‌, టైలర్‌ వెంకటయ్యతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!