Tuesday, June 30, 2026
Homeతెలంగాణపోలియో రహిత సమాజం నిర్మిద్దాం

పోలియో రహిత సమాజం నిర్మిద్దాం

📰 Generate e-Paper Clip

వెల్డండ, జూన్ 29 (చైతన్యగళం): చేర్కూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రి సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోలియో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశాన్ని పూర్తిస్థాయి పోలియో రహిత దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని పిలుపునిచ్చారు.

గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు, వార్డు సభ్యుడు రమేష్, మీసాల రాజు, కేశమోని జంగయ్య, అల్లే సందీప్, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!