పోలియో రహిత సమాజం నిర్మిద్దాం
వెల్డండ, జూన్ 29 (చైతన్యగళం): చేర్కూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి. పోలియో నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రి సద్వినియోగం చేసుకోవాలి. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పోలియో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. దేశాన్ని పూర్తిస్థాయి పోలియో రహిత దేశంగా నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం” అని...