మిడ్జిల్, జూన్ 29 (చైతన్యగళం): జూలై 4న మిడ్జిల్ మండల కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ, అలాగే గోపాల్ రెడ్డి విగ్రహం మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల ఏర్పాట్లను జిల్లా అధికారులు పరిశీలించారు.
ఈ రోజు అధికారులు బహిరంగ సభ వేదిక, మిడ్జిల్ బస్టాండ్ పరిసరాలు, విగ్రహావిష్కరణకు సంబంధించిన ప్రాంతాలను సందర్శించారు. డీఎస్పీ, ఆర్డీవో, ఎమ్మార్వోతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఏర్పాట్లను సమీక్షించారు.
స్థానిక గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు అధికారులతో కలిసి స్థలాలను చూపించి, అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
