Tuesday, June 23, 2026
Homeతెలంగాణవెంకటేశ్వరస్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

వెంకటేశ్వరస్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

రేపటి నుండి మూడు రోజులపాటు వైభవంగా ఉత్సవాలు

వినోబా నగర్, జూన్ 22 (చైతన్యగళం): వినోబా నగర్‌లోని శ్రీ భూదేవి–శ్రీదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి గురువారం వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.మంగళవారం ఉదయం గరుడ, సుదర్శన, నరసింహ హవనాలు నిర్వహించి సంతాన ప్రాప్తి, వివాహం కోసం ప్రత్యేక యాగాలు జరగనున్నాయి. సాయంత్రం శ్రీ మహాలక్ష్మి హవనంతో పాటు ఎదురు కోళ్లు ఉత్సవం జరుగుతుంది.బుధవారం ఉదయం గణపతి, దుర్గా, నవగ్రహ హవనాలు నిర్వహించి, శ్రీనివాస తిరుకళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, 108 స్వర్ణపుష్పార్చన, స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకోనున్నాయి.గురువారం ఉదయం ఆదిత్య హృదయ, మన్యుసూక్త హవనాలు, మహా పూర్ణాహుతి, చక్రస్నానం జరుగుతాయి. సాయంత్రం శ్రీ పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.ప్రతిరోజూ యాగాలు, అన్నప్రసాద వితరణ, తీర్థప్రసాద గోష్టి నిర్వహించబడతాయి. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించాలని దేవస్థాన కమిటీ కోరింది. బ్రహ్మోత్సవాలకు ధన రూపంలో లేదా వస్తు రూపంలో సహకరించాలని కూడా కమిటీ విజ్ఞప్తి చేసింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CHAITHANYA GALAM App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!