వెంకటేశ్వరస్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రేపటి నుండి మూడు రోజులపాటు వైభవంగా ఉత్సవాలు వినోబా నగర్, జూన్ 22 (చైతన్యగళం): వినోబా నగర్‌లోని శ్రీ భూదేవి–శ్రీదేవి సమేత కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి గురువారం వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.మంగళవారం ఉదయం గరుడ, సుదర్శన, నరసింహ హవనాలు నిర్వహించి సంతాన ప్రాప్తి, వివాహం కోసం ప్రత్యేక యాగాలు జరగనున్నాయి. సాయంత్రం శ్రీ మహాలక్ష్మి హవనంతో పాటు ఎదురు కోళ్లు ఉత్సవం జరుగుతుంది.బుధవారం ఉదయం గణపతి, దుర్గా, నవగ్రహ హవనాలు నిర్వహించి, శ్రీనివాస తిరుకళ్యాణ మహోత్సవం...