Wednesday, July 15, 2026
Homeతెలంగాణశ్రీ వాసవి దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

శ్రీ వాసవి దేవాలయంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

📰 Generate e-Paper Clip

ఫరూఖ్‌నగర్, జూలై 14 (చైతన్యగళం):
అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది.

ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘానికి చెందిన అన్ని విభాగాల ప్రతినిధులు హాజరై తమవంతు సహకారం అందించారు. సమాజహితమే ధ్యేయంగా సాగిన ఈ సేవా కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

కార్యక్రమం విజయవంతం కావడానికి ఆర్థిక సహకారం అందించిన దాతలు శ్రీ పలబట్ల శ్రీనివాసరావు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ, ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “సమాజ సేవా కార్యక్రమాల్లో ఇటువంటి దాతృత్వం మరెందరికో స్ఫూర్తిదాయకం” అని నిర్వాహకులు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!