పెద్దపల్లి (చైతన్యగళం): పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జండా చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పు శివకుమార్, బోయిని మనోజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా. చిరుమిల్ల రాకేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, యువ నాయకులు మాట్లాడుతూ రాకేష్ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పార్టీ కోసం 26 సంవత్సరాలుగా కష్టపడుతున్న ఆయన రానున్న రోజుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టి పెద్దపల్లి ప్రజలకు సేవ చేయాలని యువత ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బర్త్‌డే కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ కౌన్సిలర్ బిక్షపతి, ఉప సర్పంచ్ మేకల కుమార్, ఆవుల సంతోష్, కంచి నాగరాజ్, సాయి లక్ష్మణ్, సుమన్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్, పీర్ల రమేష్, ఠాగూర్ చంద్ సింగ్, పుట్ట గట్టయ్య, కన్నె శివ, ఓం ప్రకాష్, కిషన్, ఫణిందర్, అల్లం మహేందర్, పిట్ట రవీందర్, మల్లేశం, అశోక్, కంచె మధుకర్, ఉనుకొండ ప్రకాష్, అజయ్, వడ్నాల శంకర్, కొమరయ్య, తూముల శ్రీనివాస్, ఉనుకొండ మధు తదితరులు పాల్గొన్నారు.
