- 100 ట్రిప్పుల ఇసుక సీజ్
తిమ్మాపూర్, జూలై 11 (చైతన్య గళం):
తిమ్మాపూర్ మండల పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ ఇసుక డంపులపై అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. లభించిన నమ్మకమైన సమాచారం మేరకు శనివారం మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి, మొత్తం 100 ట్రిప్పుల అక్రమ ఇసుకను స్వాధీనంచేసుకున్నారు.ధ్వంసమైన అక్రమ డంపుల వివరాలునుస్థులాపూర్ గ్రామం నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన 50 ట్రిప్పుల ఇసుక డంపును అధికారులు గుర్తించి సీజ్ చేశారు.రామకృష్ణ కాలనీ: తిమ్మాపూర్ మండల పరిధిలోని రామకృష్ణ కాలనీ శివాలయం ముందు భాగంలో అక్రమంగా నిలువ ఉంచిన మరో 50 ట్రాక్టర్ల ట్రిప్పుల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న మొత్తం 100 ట్రిప్పుల ఇసుకను ఎల్ఎండి పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించి, దానికి సంబంధించిన రశీదులను పొందడం జరిగిందని అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులుహెచ్చరించారు.కమీషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక నిల్వలపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.
