కల్వకుర్తి, జూలై 13 (చైతన్యగళం):
కల్వకుర్తి మండలంలోని కురుమిద్ధ, మార్చాల, జీడిపల్లి, తోటపల్లి, వేపూరు, గుండూరు, సుద్ధకల్ గ్రామాల్లో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారం బిఎల్ఏ ఏజెంట్లు, పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. బిఎల్ఏ ఏజెంట్లు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు నమోదు చేసి, ఓటు హక్కు పరిరక్షణలో చురుకుగా ఉండాలి” అని సూచించారు.ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను విజయవంతం చేయడంలో బీజేపీ శ్రేణులు చురుకుగా పాల్గొని ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కృష్ణారెడ్డి, కృష్ణగౌడ్, సురేందర్ గౌడ్, శ్రీశైలం, రాజశేఖర్, లింగారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
