తెలకపల్లి, జూలై 2 (చైతన్యగళం): నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న నూతన బస్టాండ్ స్థలాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ నెల 8వ తేదీన నూతన బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
నూతన బస్టాండ్ నిర్మాణంతో జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
