Thursday, September 10, 2026
Homeతెలంగాణరంగారెడ్డిఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో ఐక్యత పెరుగుతుంది

ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామాల్లో ఐక్యత పెరుగుతుంది

📰 Generate e-Paper Clip

షాద్‌నగర్, జూలై 2 (చైతన్యగళం):
మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గొల్ల కేతమ్మ, భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్థంభ ప్రాణ ప్రతిష్ఠ, బొడ్రాయి పండుగ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారు, స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘం నాయకులు, గ్రామ ప్రజలను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో ఐక్యతను, సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు సనాతన సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తాయి. గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆకాంక్షిస్తున్నాను” అని తెలిపారు.ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, యాదవ సంఘం నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!