వైద్యులు కనిపించని దేవుళ్ళు
హైదరాబాద్, జూలై 1 (చైతన్యగళం): ప్రతి సంవత్సరం జూలై 1న ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లోని KIDZEE ప్రీ స్కూల్లో PRG ఫౌండేషన్ ఆధ్వర్యంలో, ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
డాక్టర్ రాధిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PRG ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త మాట్లాడుతూ, “వైద్యులు కనిపించని దేవుడులు. మనకు జన్మనిచ్చే దేవుడు కనిపించకపోయినా, మన ఆరోగ్యాన్ని కాపాడే వైద్యుడు మన కళ్ల ముందే ఉంటాడు. ఆయన ప్రతి రోగికి పునర్జన్మ ప్రసాదిస్తాడు” అని అన్నారు.

వైద్యుల సేవలకు గుర్తింపుగా, ప్రపంచంలోనే అత్యంత గొప్ప వైద్యుడు, బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జ్ఞాపకార్థంగా ఆయన జయంతి, వర్ధంతి రోజైన జూలై 1న ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నట్లు వివరించారు. కీర్తిశేషులు ప్రొద్దుటూరి వెంకన్న గుప్త జ్ఞాపకార్థం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, PRG ఫౌండేషన్ సభ్యులు ప్రొద్దుటూరి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
