- ఏరువాక పున్నమి సందర్భంగా గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దర్శనం
షాద్ నగర్ , జూన్ 29(చైతన్యగళం) : ఏరువాక పున్నమి పురస్కరించుకుని షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దేవస్థానంను దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు. అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ దర్శన కార్యక్రమంలో శ్రీ సాయి కాలనీ వాసులు బాలకృష్ణ, అంజనేయులు, వెంకట్ రెడ్డి, మురళీ సెట్, రాజిరెడ్డి, తిమ్మారెడ్డి, కృష్ణారెడ్డి, పండరీనాథ్, సుదర్శన్ గౌడ్, యాదిరెడ్డి, కొండా నాగేష్, హరిమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ఏర్రోళ్ల శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
