Tuesday, June 30, 2026
Homeతెలంగాణఓటరు ధ్రువీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలి

ఓటరు ధ్రువీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

  •  పట్టణ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమ ఇన్‌చార్జిలు లంకాల సురేష్ రెడ్డి, జాంగారి రవి
  • సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో గృహ గణన ఫారాల పంపిణీ

షాద్ నగర్ , జూన్ 29 (చైతన్యగళం) : సమగ్ర ఓటరు సవరణ కార్యక్రమంలో భాగంగా 27వ వార్డులో గృహ గణన ఫారాల పంపిణీ, పరిశీలన ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ మున్సిపాలిటీ 27వ వార్డులో పట్టణ ఎస్‌ఐఆర్‌ కార్యక్రమ ఇన్‌చార్జిలు లంకాల సురేష్ రెడ్డి, జాంగారి రవి, బూత్ స్థాయి ప్రతినిధి మంగ అశోక్ ఆధ్వర్యంలో గృహ గణన ఫారాల పంపిణీ, పరిశీలన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా లంకాల సురేష్ రెడ్డి, జాంగారి రవి మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు ధ్రువీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు. నియోజక వర్గంలోని ప్రతి ఓటరు వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలని, ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఓటరు నమోదు, ధ్రువీకరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 27వ వార్డు బూత్ స్థాయి ప్రతినిధి మంగ అశోక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవర్ధన్ రెడ్డి, రషీద్, బూత్ స్థాయి అధికారి కరుణ తదితరులు పాల్గొన్నారు. గృహ గణన ఫారాల పంపిణీ, పరిశీలన కార్యక్రమాన్ని వారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!