జగిత్యాల, జూన్ 25 (చైతన్యగళం): భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో గురువారం బీజేవైఎం నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేవైఎం జగిత్యాల జిల్లా కన్వీనర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “కేంద్రంలో నరేంద్ర మోడీ 12 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా దేశవ్యాప్తంగా యువసమ్మేళనం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27న ఉదయం 10 గంటలకు జగిత్యాల పట్టణంలోని ఎస్‌వి ఎల్ ఆర్ గార్డెన్‌లో యువసమ్మేళనం జరుగుతుంది” అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ పాల్గొంటారని ఆయన వెల్లడించారు. జిల్లాలోని బీజేవైఎం మండల అధ్యక్షులు, నాయకులు, యువకులు అందరూ ఈ సమావేశానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే ఈ యువసమ్మేళనం లక్ష్యం” అని పేర్కొన్నారు.
