Sunday, August 30, 2026
Homeసంపాదకీయంపారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం

పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ వినియోగదారులకు భారీ ఉపశమనం

📰 Generate e-Paper Clip

పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనాన్ని కలిగించే శుభవార్త చెప్పింది. దేశీయేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై ఉన్న అన్ని రకాల రంగాలవారీ పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది.

న్యూఢిల్లీ, జూన్ 25(చైతన్యగళం): పారిశ్రామిక, వాణిజ్య ఎల్‌పీజీ (LPG) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనాన్ని కలిగించే శుభవార్త చెప్పింది. దేశీయేతర ప్యాక్డ్ ఎల్‌పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై ఉన్న అన్ని రకాల రంగాలవారీ పరిమితులను పూర్తిగా ఎత్తివేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి ప్యాక్డ్ ఎల్‌పీజీ సరఫరాను ప్రభుత్వం పునరుద్ధరించింది. గతంలో నిలిపివేసిన బల్క్ ఎల్‌పీజీ సరఫరాపై కూడా ఆంక్షలను సడలించింది. సంక్షోభానికి ముందు ఉన్న వినియోగంలో 50 శాతం సరఫరాకు అనుమతినిచ్చింది.

దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తి మెరుగుపడటం, దిగుమతి చేసుకునే ఎల్‌పీజీ లభ్యత అంచనాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ దేశ ఇంధన భద్రతను నిర్ధారిస్తూనే.. పారిశ్రామిక అవసరాలకు స్వచ్ఛమైన, సమర్థవంతమైన ఇంధనాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు.. చిన్న, మధ్య తరహా పారిశ్రామిక వినియోగదారులకు ఎంతో మేలు జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!