Wednesday, June 24, 2026
Homeబిజినేస్వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

వాట్సాప్‌ గ్లోబల్‌ హెడ్‌గా కునాల్‌ షా

📰 Generate e-Paper Clip

బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌లో గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం మెటా రూ.8,550 కోట్ల (దాదాపు 90 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ మెగా డీల్‌లో భాగంగా క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా…

న్యూఢిల్లీ: బెంగళూరు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ క్రెడ్‌లో గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం మెటా రూ.8,550 కోట్ల (దాదాపు 90 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ మెగా డీల్‌లో భాగంగా క్రెడ్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ షా కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈవో) పదవి నుంచి తప్పుకోనున్నారు. కునాల్‌ షాను ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ అయిన వాట్సాప్‌ గ్లోబల్‌ సీఈవోగా మెటా నియమించింది. దాదాపు ఏడేళ్లుగా వాట్సాప్‌ సీఈవోగా వ్యవహరిస్తున్న విల్‌ కాథ్‌కార్ట్‌ స్థానంలో షా బాధ్యతలు స్వీకరిస్తారు. కాథ్‌కార్ట్‌.. మెటాలో కొత్త బాధ్యతలను చేపట్టనున్నారు.

వాట్సాప్‌ సీఈఓ పదవి తొలిసారిగా భారతీయుడికి దక్కడం విశేషం. కునాల్‌ షా.. మెటా గ్లోబల్‌ లీడర్‌షిప్‌ టీమ్‌లో చేరినా.. క్రెడ్‌లో ఆయనకున్న వ్యక్తిగత వాటాలను కొనసాగిస్తారని క్రెడ్‌ సోమవారం తెలిపింది. షా తన పదవి నుంచి తప్పుకోవడంతో కంపెనీ స్ర్టాటజీ, ఫైనాన్స్‌ విభాగాధిపతిగా ఉన్న మితేన్‌ సంపత్‌ తాత్కాలిక సీఈవోగా నియమితులయ్యారు. క్రెడ్‌లో మెటా పెట్టుబడితో మైనారిటీ వాటా (20 శాతం)ను సొంతం చేసుకోనుం ది. డీల్‌లో భాగంగా కంపెనీ విలువను రూ.43,239 కోట్లు (సుమారు 450 కోట్ల డాలర్లు)గా లెక్కగట్టారు.

ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభం: 2018లో క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుల కోసం క్రెడ్‌ను కునాల్‌ షా ప్రారంభించారు. క్రెడిట్‌ కార్డుల బిల్లులను సరైన సమయానికి చెల్లించే వినియోగదారులకు రివార్డులు ఇవ్వడంపై తొలుత క్రెడ్‌ దృష్టి సారించింది. తర్వాత చెల్లింపులు, రుణాలు, బీమా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, లైఫ్‌స్టైల్‌ ప్రొడక్ట్స్‌ను అందించే విస్తృత ఆర్థిక సేవల వేదికగా మారింది. ప్రస్తుతం క్రెడ్‌ను ప్రతి నెలా 1.7 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. క్రెడ్‌ రుణ వితరణ వ్యాపారం రూ.24,000 కోట్లకు చేరుకుంది.

రెండో ఎగ్జిట్‌: కునాల్‌ షా.. తన కెరీర్‌లో రెండోసారి ఒక స్టార్టప్‌ నుంచి నిష్క్రమిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన ఫ్రీచార్జ్‌ అనే డిజిటల్‌ చెల్లింపులు, మొబైల్‌ రీచార్జ్‌ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించి విక్రయించారు. పలు ఎర్లీ స్టేజ్‌ స్టార్ట్‌పలలో పెట్టుబడి పెట్టారు. దేశంలో చాలా యాక్టివ్‌గా ఉన్న ఇన్వెస్టర్లలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.

‘‘కునాల్‌ షా.. వాట్సాప్‌ తదుపరి సారథిగా మెటాలో చేరనున్నారు. ఆయన క్రెడ్‌ను భారత్‌లో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్‌ యాప్‌ను నడపడంలో ఆయనకున్న నిర్మాణ దృక్పథం ఎంతగానో దోహదపడనుంది. కోట్లాది మంది ప్రజలకు, లక్షలాది మంది వ్యాపారులకు వా ట్సా్‌పను మరింత చేరువ చేయటంతో పాటు కునాల్‌తో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నాను.’’

మార్క్‌ జుకర్‌బర్గ్‌, సీఈవో, మెటా

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!