- టీఎంయూ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి
హుస్నాబాద్, నవంబర్ 27 (చైతన్యగళం):
ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాజీలేని పోరాటం చేస్తోందని ఆ యూనియన్ హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. టీఎంయూ ఏర్పడి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యూనియన్ జెండాను ఆవిష్కరించారు.
అనంతరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే వరకు కార్మికుల పక్షాన టీఎంయూ అండగా నిలుస్తుందని తెలిపారు. కార్మికుల వేతన సమస్యలు, ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి, సెలవులు, పెండింగ్ బకాయిల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు. కార్మికుల ఐక్యతే యూనియన్‌కు బలమని, భవిష్యత్తులోనూ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు రమణారెడ్డి, ఎస్టీ రెడ్డి, పవన్, కొండాల్‌రెడ్డి, రాజు, పరశురాములు, రాజిరెడ్డి, మహిళా కార్మికులు జ్యోతి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

