ఆర్టీసీ కార్మికుల సమస్యలపై రాజీలేని పోరాటం

టీఎంయూ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి హుస్నాబాద్, నవంబర్ 27 (చైతన్యగళం): ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) రాజీలేని పోరాటం చేస్తోందని ఆ యూనియన్ హుస్నాబాద్ డిపో కార్యదర్శి రాగిరెడ్డి సుధాకర్‌రెడ్డి అన్నారు. టీఎంయూ ఏర్పడి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో పూర్తిస్థాయిలో విలీనం చేసే వరకు కార్మికుల...