Sunday, November 22, 2026
Homeతెలంగాణఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

ఘనంగా ముగిసిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

  • గ్రంథాలయాలతో పేద విద్యార్థులకు బంగారు భవిష్యత్తు – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి రమేష్‌ నాయక్‌

మహబూబాబాద్‌, నవంబర్‌ 21 (చైతన్యగళం):

మహబూబాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు నిర్వహించిన వేడుకల్లో భాగంగా చివరి రోజు ముగింపు కార్యక్రమంతో పాటు బహుమతి ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు నిరుపేద విద్యార్థులు, నిరుద్యోగ యువతకు విజ్ఞానాన్ని అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తాయని అన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజూ కొంత సమయాన్ని చదువుకు కేటాయిస్తూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకుని, పోటీ పరీక్షల్లో విజయం సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వెన్నం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విజ్ఞాన వికాసానికి, జీవన పురోగతికి కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. సాధారణ వ్యక్తులు కొనుగోలు చేయలేని విలువైన పుస్తకాలు సైతం గ్రంథాలయాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను చదివి విస్తృత జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత గ్రంథాలయాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి తూర్పాటి శ్రీలత, లైబ్రేరియన్లు జి. విజేందర్‌, రుద్రారపు వీరేందర్‌, సిబ్బంది బొడ్డుపల్లి భూలక్ష్మి, బి. యాదమ్మ, సీనియర్‌ నాయకులు నర్సింగా శ్రీనివాస్‌, సీనియర్‌ పాఠకుడు, పుస్తక ప్రియుడు అబ్బగాని భాస్కర్‌, పాఠశాల ఉపాధ్యాయులు రాచకొండ ఉపేందర్‌, గాడిపల్లి ప్రవీణ్‌, జి. అనూజ, ప్రవీణ్‌, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!