Friday, November 20, 2026
Homeతెలంగాణరాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో చికోడు విద్యార్థినుల ప్రతిభ

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీల్లో చికోడు విద్యార్థినుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

  • అండర్‌–14 బాలికల విభాగంలో మెదక్‌ జిల్లా జట్టుకు తృతీయ స్థానం

దుబ్బాక, నవంబర్‌ 20 (నీలగిరి ఎక్స్‌ప్రెస్‌):

రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14 వాలీబాల్‌ పోటీల్లో చికోడు పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో కే. హారిక, ఏ. శ్యామల మెదక్‌ జిల్లా జట్టు తరఫున పాల్గొని చక్కటి ఆటతీరును ప్రదర్శించారు. బాలికల అండర్‌–14 వాలీబాల్‌ విభాగంలో మెదక్‌ జిల్లా జట్టు తృతీయ స్థానం సాధించింది.

ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచి జిల్లా జట్టు విజయంలో భాగస్వాములైన విద్యార్థినులను చికోడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలరాజు, ఉపాధ్యాయ బృందం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!