Friday, November 6, 2026
Homeతెలంగాణమిరుదొడ్డిలో ఈ నెల 10న ఉద్యమకారుల మహాసభ

మిరుదొడ్డిలో ఈ నెల 10న ఉద్యమకారుల మహాసభ

📰 Generate e-Paper Clip

  • హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమమే శరణ్యం
  • ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు డిమాండ్

మిరుదొడ్డి, నవంబర్ 6 (చైతన్యగళం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఈ నెల 10న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గ స్థాయి ఉద్యమకారుల మహాసభ నిర్వహించనున్నట్లు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులు వెల్లడించారు. ఈ సందర్భంగా వల్లాల సత్యనారాయణ, మిరుదొడ్డి మండల అధ్యక్షుడు బాబు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్, ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించకపోవడం ఉద్యమకారులను అవమానించడమేనని మండిపడ్డారు.

ఉద్యమకారుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, వారి సేవలను గుర్తించి ఇచ్చిన హామీలను అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి, అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న నిర్వహించే మహాసభకు దుబ్బాక నియోజకవర్గంలోని ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్, పూడూరి శ్రీనివాస్, మల్లేశం, నారాయణరెడ్డి, రాందేవ్, జ్ఞానేశ్వర్, బలిజ రమేష్, ద్వార మల్లయ్య, హరికృష్ణ, ననం రాజయ్య, వెంకటేష్, ఆశా గౌడ్, రమేష్ గౌడ్, భూమరాజయ్య, నక్క రాజయ్య, వానం రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!