మిరుదొడ్డిలో ఈ నెల 10న ఉద్యమకారుల మహాసభ

హామీలు నెరవేర్చకపోతే మరో ఉద్యమమే శరణ్యం ఉద్యమకారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు డిమాండ్ మిరుదొడ్డి, నవంబర్ 6 (చైతన్యగళం): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి వారికి న్యాయం చేయాలని, లేనిపక్షంలో మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని...