Saturday, October 31, 2026
Homeతెలంగాణకరీంనగర్సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

📰 Generate e-Paper Clip

  • విజిలెన్స్‌, కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించాలి: భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత వేణుగోపాల్‌రెడ్డి

హుస్నాబాద్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం):

హుస్నాబాద్‌ మండలంలో 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలు అర్హులైన రైతులకు అందకుండా పక్కదారి పట్టించారని భారతీయ కిసాన్‌ సంఘ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల అండదండలతోనే వేరుశనగ విత్తనాల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై హుస్నాబాద్‌ ఏడీఏకు వినతిపత్రం అందజేసినప్పటికీ ఇప్పటివరకు విచారణ చేపట్టలేదని విమర్శించారు. ఏఓ, ఏఈఓలు బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు.

హుస్నాబాద్‌ మండలంతో పాటు అక్కన్నపేట మండలంలోనూ ఇదే పరిస్థితి ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను పక్కనపెట్టి రాజకీయ నాయకుల ప్రభావంతో విత్తనాలను ఇష్టానుసారంగా పక్కదారి పట్టించారని పేర్కొన్నారు.

వెంటనే జిల్లా కలెక్టర్‌, విజిలెన్స్‌ అధికారులు జోక్యం చేసుకుని రైతుల వివరాలు, సమర్పించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని కోరారు. స్థానిక గ్రామ చావడిలో విచారణ నిర్వహించి, పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులైన వ్యవసాయ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాల్లో ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే తహసీల్దార్‌ కార్యాలయం, రైతు వేదికల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని వేణుగోపాల్‌రెడ్డి హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!