సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీలో అక్రమాలపై విచారణ జరపాలి

విజిలెన్స్‌, కలెక్టర్‌తో సమగ్ర విచారణ చేయించాలి: భారతీయ కిసాన్‌ సంఘ్‌ నేత వేణుగోపాల్‌రెడ్డి హుస్నాబాద్‌, అక్టోబర్‌ 30 (చైతన్యగళం): హుస్నాబాద్‌ మండలంలో 100 శాతం సబ్సిడీపై పంపిణీ చేయాల్సిన వేరుశనగ విత్తనాలు అర్హులైన రైతులకు అందకుండా పక్కదారి పట్టించారని భారతీయ కిసాన్‌ సంఘ్‌ డివిజన్‌ ఇన్‌చార్జి కవ్వ వేణుగోపాల్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అధికారులు, జిల్లా కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అధికారుల అండదండలతోనే వేరుశనగ విత్తనాల పంపిణీలో...