Wednesday, October 28, 2026
Homeతెలంగాణకరీంనగర్అక్కన్నపేట మండల రజక సంఘ అధ్యక్షుడిగా జంగపల్లి రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

అక్కన్నపేట మండల రజక సంఘ అధ్యక్షుడిగా జంగపల్లి రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

  • బీసీ-ఏలో ముదిరాజులను చేర్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: రజక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు

అక్కన్నపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం):

అక్కన్నపేట మండల రజక సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ గణేష్‌, జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ధీటి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అంతకపేట గ్రామానికి చెందిన జంగపల్లి రఘుపతి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఊళ్లెంగుల రాజు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి పరుశురాములు, కార్యదర్శిగా కొలిపాక అశోక్‌, కోశాధికారిగా వంగపల్లి రాజు, ప్రచార కార్యదర్శిగా పాండ్రాల మోహన్‌బాబు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా బందారం రమేష్‌, వంగపల్లి సమ్మయ్య, తంగళ్లపల్లి రమేష్‌, కొలుగూరి అజయ్‌, కొలిపాక రమేష్‌, జంగపల్లి రాజశేఖర్‌, కొలుగూరి కుమార్‌, నాంపల్లి పోచయ్య, గంపల బాలయ్య, జంగపల్లి రవీందర్‌, పరుశురాములు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి రాష్ట్ర, జిల్లా నాయకులు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రజకులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే మహిళలపై దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రజకుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వారి అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.

బీసీ-ఏ వర్గంలో రజకులతో పాటు అనేక సంచార జాతులు ఉన్నాయని, ఆయా వర్గాల ప్రజలు విద్య ద్వారా క్రమంగా అభివృద్ధి సాధిస్తున్నారని నాయకులు తెలిపారు. అంబేద్కర్‌ కల్పించిన రిజర్వేషన్ల ద్వారా వెనుకబడిన వర్గాలకు అవకాశాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న ముదిరాజులను బీసీ-ఏలో చేర్చే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రస్తావించడం తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు నాయకులు పేర్కొన్నారు. బీసీ-ఏ వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ-ఏలో కొనసాగుతున్న సంచార జాతుల ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన రజక సంఘం నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!