అక్కన్నపేట మండల రజక సంఘ అధ్యక్షుడిగా జంగపల్లి రఘుపతి ఏకగ్రీవ ఎన్నిక
బీసీ-ఏలో ముదిరాజులను చేర్చే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలి: రజక సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు అక్కన్నపేట, అక్టోబర్ 28 (చైతన్యగళం): అక్కన్నపేట మండల రజక సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ధీటి రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అంతకపేట గ్రామానికి చెందిన జంగపల్లి రఘుపతి మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా ఊళ్లెంగుల రాజు, ప్రధాన కార్యదర్శిగా తంగళ్లపల్లి పరుశురాములు, కార్యదర్శిగా కొలిపాక...