Saturday, October 24, 2026
Homeసంపాదకీయంగడివేముల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున దివ్యవాణి నామినేషన్

గడివేముల జెడ్పీటీసీ అభ్యర్థిగా జనసేన తరఫున దివ్యవాణి నామినేషన్

📰 Generate e-Paper Clip

గడివేముల, అక్టోబర్ 24 (చైతన్యగళం): జనసేన పార్టీ గడివేముల మండల అధ్యక్షుడు ధరణి చంద్రమోహన్ సతీమణి దివ్యవాణి, గడివేముల మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, పాణ్యం నియోజకవర్గ ఇన్‌చార్జి చింత సురేష్ బాబు ప్రోత్సాహంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగుతున్నారని జనసేన పార్టీ గడివేముల మండల నాయకుడు సూర నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన దివ్యవాణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు తమ మద్దతు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!