Thursday, October 15, 2026
Homeతెలంగాణకరీంనగర్సైదాపూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా చెల్మెల రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక

సైదాపూర్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా చెల్మెల రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక

📰 Generate e-Paper Clip

  • పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్

సైదాపూర్,అక్టోబర్ 15(చైతన్యగళం):

ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితెల సతీష్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలాబోతారం గ్రామంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి మాజీఎమ్మెల్యే సతీష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని పార్టీ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటుందని,పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు,భవిష్యత్ కార్యాచరణ పై దిశా నిర్దేశం చేశారు.అనంతరం నూతన మండల కార్యవర్గాన్ని ప్రకటించారు.బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చెలిమెల రాజేశ్వర్ రెడ్డిని,మండల ప్రధాన కార్యదర్శిగా పైడిపల్లి రవీందర్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన మండల అధ్యక్షులకు,ప్రధాన కార్యదర్శికి పార్టీ నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పార్టీని మండలంలోని ప్రతి గ్రామంలో మరింత బలోపేతం చేస్తూ పార్టీ కార్యకర్తలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!